Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 12:15 pm Posted by : ramakrishna

బీసీ బిల్లు ఆమోదం కోసం త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం

హైదరాబాద్, బతుకమ్మ :  బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఏపార్టీకి లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం చేపట్టిన బీసీ బంద్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్ పేట చౌరస్తా వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బంద్ విజయవంతమైందని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తామన్నారు. ప్రభుత్వ పరంగా 42 శాతంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నామన్నారు. సాధ్య సాధ్యాలు పరిశీలించినంతరం స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుమంటామని వెల్లడించారు.