Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 5:17 pm Posted by : ramakrishna

రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ విధి విదానాలు అందుబాటులోకి తెస్తాం

 

… రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

మున్నూరు కాపు కార్పొరేషన్ విధివిధానాలు త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల ,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాం చక్రవర్తి మాట్లాడుతూ…. మున్నూరు కాపులు ఎవరైనా సమస్యల పరిష్కారానికి తన వద్దకు వస్తే ఆ దిశలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీరామ్ చక్రవర్తి పటేల్ ఉద్ఘాటించారు . కాపులకు అందుబాటులో ఉన్న రెండు ఎకరాల వారి వసతి గృహాలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండమన్నారు జిల్లాలోని ఆయా సంఘాల ప్రతినిధులు దృష్టికి తీసుకు వస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ కాపు సోదరులు కుటుంబ అభ్యున్నతికి జిల్లా కమిటీ ఎల్లప్పుడూ సహయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కాపు విద్యార్థులు అందరూ రాణించి వివిధ స్థాయి లో ప్రభుత్వ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్సి తదితర  కోర్సుల్లో చేరి ప్రాథమిక పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ పరీక్షలు అభ్యసించడానికి జిల్లా సంఘం కమిటీ సభ్యులతో సంప్రదించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులు గా జిల్లా మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ ప్రతిభ అవార్డ్స్ నివేదిక సమర్పించారు. సమావేశం అనంతరం ప్రతిభా పురస్కారాలు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పీజీ సెట్ క్రీడల అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రం తో గోల్డ్ మెడల్ శాలువాతో సత్కరించడం జరిగింది ముందుగా రెంజర్ల జిగి షా పటేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించినందుకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన పాటలతో మంత్రముగ్ధులు చేసిన సిర్పలింగం అర్షపల్లి ని జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ రూ.50,000 నగదు తో సత్కరించారు.

We will make the official documents of the State Munnur Kapu Corporation available