Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 6:23 pm Posted by : ramakrishna

అవినీతి రహిత ఇందూరుగా తీర్చిదిద్దుతాం

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మన నిజామాబాద్ జిల్లాని అవినీతి రహిత ఇందూర్ గా తీర్చిదిద్దుతామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 50వ డివిజన్ శివాజీ నగర్‌లో శనివారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగదీష్ కులకర్ణి కి మద్దతుగా కార్నర్ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సూర్య నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కదానిని కూడా అమలు చేయని చేతగాని, అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను ఎదుర్కొనే నైతిక హక్కు లేదన్నారు. మన ఇందూర్ మన మేయర్ అని భారతీయ జనతా పార్టీ నినాదం వినిపిస్తేనే ఇతర పార్టీలకు గుబులు పుడుతోందని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక వర్గానికి భయపడి ఇందూరుఅనే పేరు కూడా పలకలేని పరిస్థితిలో ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్, మైనార్టీ పార్టీలు, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. గత పదేళ్ల పాలనలో పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పటికీ, ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించలేని చేతకాని మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాలనపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో అభివృద్ధి లేకుండా అవినీతి కమీషన్లు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిందూ దేవతలను అవమాన పరుస్తున్న పార్టీలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, మెజార్టీ స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కిట్టు పాటిల్, బాలకృష్ణ, దీపక్, అల్లాడి రాజు తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, 50వ డివిజన్‌కు చెందిన పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

 

We will make Indore corruption-free.