- జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
భీమ్ గల్, బతుకమ్మ : గత బీయర్ఎస్ ప్రభుత్వం అసంబద్ద పాలన వల్ల అయిన అప్పులకు వడ్డీలను కడుతూ అభివృద్ధి పనులను ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకసైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తో కలిసి చెక్కులను పంపిణి చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్రం అప్పుల్లో కురక పోయిందని అయిన సీ. ఎం రేవంత్ రెడ్డి నేత్రత్వం లోని ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తోందని అన్నారు.గత 64 యేండ్లుగా పాలించిన 21 మంది ముఖ్యమంత్రులు రూ. 64వేల కోట్ల అప్పులు చేస్తే పది సంవత్సరాలు పాలించిన బీయర్ఎస్ ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు.గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 6 వేల కోట్లు వడ్డీ కడుతోందని తెలిపారు. అప్పుల కారణంగానే ఇప్పటికిప్పుడు కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అయిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలెండరు పై సబ్సిడీ, సన్న ధాన్యం కు రూ. 500 బోనస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణి, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణి వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి గుర్తు చేశారు. భూభారతి చట్టాన్ని తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య రైతులు ఇబ్బందులు పడకుండా చేసిందన్నారు. రూ. 21వేల కోట్లతో రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణ మాఫీ చేసిందన్నారు.కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇకపై దరఖాస్తూ చేసుకొన్న నెల లోగా చెక్కులు అందేలా చర్యలు తీసుకొంటామని మంత్రి వెల్లడించారు. ఈ సారి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణిలో ఎన్నికల నియామవలి కారణంగా జాప్యం జరిగిందని అన్నారు. కార్యమానికి ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా తనను క్షేమించాలని మంత్రి కోరారు.ఇంచార్జ్ మంత్రి కి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సాధర స్వాగతం పలికారు. శాలువ, పూల మాలతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూర్ ఆర్డీవో, నియోజకవర్గ తహసీల్దార్లు, స్థానిక అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.