Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 5:25 pm Posted by : ramakrishna

స్వంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు మంజూరు చేస్తాం

– వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

– లక్ష్మాపూర్ క్యాంపు లో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

రుద్రూర్, బతుకమ్మ  : స్వంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ పేరిట ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని లక్ష్మాపూర్ క్యాంప్ గ్రామం నుండి అక్బర్ నగర్ గ్రామం వరకు 1 కోటి రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను, ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. స్వంత స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ పేరిట ఇల్లు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. అనంతరం అక్బర్ నగర్ గ్రామంలోని ఫుడ్ సైన్స్ కళాశాలను సందర్శించారు.

We will grant houses to the poor who have their own land

కళాశాల ప్రిన్సిపల్,విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, జహిరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నాగేష్, మాజీ వైస్ ఎంపిపి నట్కరి సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి లక్ష్మణ్, సొసైటీ మాజీ చైర్మన్ పత్తి రాము స్వామి, మాజీ రైతు సమన్వయ సమితి చైర్మన్ తోట సంగయ్య, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు, ఎసై సాయన్న, ఆర్ ఐ నజీర్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

We will grant houses to the poor who have their own land