. . . కాంగ్రెస్ లో చేరిన జనసేన పార్టీ నాయకులు
కామారెడ్డి, బతుకమ్మ :
రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేస్తామని గణగోన లక్ష్మీ నర్సాగౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి నాయకులు పార్టీలోకి రావడం పట్ల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు, క్యాషియర్, మాదాస్ రాజలింగం, సెక్రటరీలు పార్టీలోకి రావడం వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, అరుణ్, మెహర్ బాబా గౌడ్, శ్రీకాంత్ ఉన్నారు.
