మూసీ, ఈసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం

హైదరాబాద్, బతుకమ్మ : మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలించి మూసీ, ఈసా నదులను ఆనీళ్లతో నింపుతామన్నారు. ఏడాదంతా మూసీ నదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మూడు సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ చేపట్టాయన్నారు. యూపీలో గంగా ప్రక్షాళన చేశారని, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. మూసీని కలుషితం చేయడంతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. మూసీ నదిని...