రైతులకు పట్టాలిచ్చే వరకు పోరాడతాం
ఆత్మహత్యల ఆలోచనలు వద్దు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్, బతుకమ్మ : రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతామని, ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతులకు ధైర్యం చెప్పారు. జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను ఆదివారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్యయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన...