. వడ్డీ వ్యాపారుల తీరుపై భగ్గుమన్న ఆర్యవైశ్యులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అధిక వడ్డీ వసూలు చేయడంతోపాటు కుటుంబంపై దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేసి తండ్రీకూతురు మృతికి కారకులైన వడ్డీ వ్యాపారులను వెంటనే శిక్షించాలని ఆర్యవైశ్య నాయ కులు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల జోలికి వస్తే ఊరుకోబోమ ని హెచ్చరించారు. అప్పు తీర్చేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని బతిమాలినా వడ్డీ వ్యాపారి భయబ్రాంతులకు గురి చేసి తనతోపాటు కూతురితో అసభ్యంగా మాట్లాడారని బాధితురాలు అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు. తండ్రి కూతుళ్ళ మృతిపై పోలీస్ శాఖ వెంటనే పూర్తి విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని ఆర్యవైశ్య సంఘం నాయకులు స్పష్టం చేశారు.