కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు పోరాటం చేస్తాం
42శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ హైదరాబాద్, బతుకమ్మ : కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, విశ్వకర్మ కుల సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ...