Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 8:06 pm Posted by : ramakrishna

శాంతి భద్రతల విషయంలో సహాయ సహకారాలు అందజేస్తాం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలో శాంతిభద్రతల విషయంలో ఎల్లవేళలా పోలీస్ యంత్రాంగానికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తాని అన్నారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన మనోజ్ కుమార్ ను రుద్రూర్ మైనార్టీ నాయకులు శనివారం రోజున  మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుద్రూర్ ఎస్సైగా పనిచేసిన సాయన్న బదిలీపై వెళ్లడంతో మనోజ్ కుమార్ రుద్రూర్ ఎస్సైగా గత రెండు రోజుల క్రితం బాధ్యతలను స్వీకరించారు. ఎస్ఐ ని కలిసిన వారిలో తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సయ్యద్ ముల్తాని, మొహమ్మద్ ఇక్రమ్, మొహమ్మద్ జమీల్ ఉన్నారు.