Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:59 pm Posted by : ramakrishna

మున్ముందు మరిన్ని న్యూట్రిషన్ కిట్లు పంపిణిీ చేస్తాం

  • రెడ్ క్రాస్సొసైటీ చైర్మన్ ఆంజనేయులు

 

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : టీ. బీ వ్యాధిగ్రస్థులకు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేందుకు గాను మున్ముందు మరిన్ని న్యూట్రిషన్ కిట్లను పెంచి పంపిణి చేసేందుకు కృషి చేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుసా ఆంజనేయులు అన్నారు. టీ. బి ముక్త్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టీ. బీ వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లను ఆయన పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి గ్రస్థులకు పౌష్టికాహార కిట్స్ ని  వ్యాధితో బాధపడుతున్న వారికీ మా వంతు భాగస్వామిగా కిట్స్ ఇవ్వడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో రెడీక్రాస్ సొసైటీ సెక్రటరీ అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, జిల్లా టిబి కోఆర్డినేటర్ రవిగౌడ్, లక్ష్మణ్,డీపీపీఎం నరేష్,విజయమాల, ఓల్డ్ ఏజ్ హోమ్ కోఆర్డినేటర్ నవీన్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.