మూసీ రివర్‌ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులు తప్పక పూర్తి చేస్తాం

  . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల సమస్యలు హైదరాబాద్‌కు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో గురువారం నిర్వహించిన వనమహోత్సవం–2026...