. . . ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంధర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు కై ఉద్యమ కార్య చరణ రూపొందిస్తామని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంధర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ మాట్లాడుతూ 1 /9/ 2004 కన్నా ముందు నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కల్పిస్తామని ఇటీవల జరిగిన ముఖ్యమంత్రితో జేఏసీ సమావేశంలో ముఖ్య మంత్రి హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారులు ముఖ్యమంత్రితో మాట్లాడిన దానికి విరుద్ధంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దీన్ని ఎస్ టి యు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఇది విరుద్ధమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఎస్టీయు నుండి కేంద్ర ప్రభుత్వ మెమో 57 అమలే ఏకైక ఎజెండా గా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్షి ధర్మేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.