Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:11 pm Posted by : ramakrishna

విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తాం

 

. . . సామాజిక తెలంగాణ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాటాలు చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుతామని సామాజిక తెలంగాణ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ అన్నారు. ఎస్ టీ ఎఫ్ జిల్లా నూతన ఉపాధ్యక్షుడిగా క్రాంతి కిరణ్ రాథోడ్ నియమించిన సందర్భంలో శుక్రవారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం విద్యా రంగంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, సరైన వసతులు సౌకర్యాలు లేక విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. సరైన విద్యా బోధన అందక పోటీ పరీక్షలను తట్టుకోలేక వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఏకం చేసి వారితో కలిసి విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తామని, విద్యార్థులకు సరైన విద్యాబోధనతో పాటు అన్ని రకాల వసతులు అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన క్రాంతి కిరణ్ రాథోడ్ కు నియామక పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టీ ఎఫ్ సురేష్ నాయక్, వికాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.