. . . మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను విడతల వారిగా నిర్వహిస్తామని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. 18వ వార్డు గౌలిగూడ, కుమ్మరిగల్లి లో పేరుకుపోయిన డ్రైనేజీల్లోని పూడికను పారిశుద్య కార్మికులచే శుభ్రపరచం.కాలనీలో అస్తవ్యస్థంగా ఉన్నటువంటి డ్రైనేజీలను శుభ్రపరిచి మురికి నీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకుటం . రాబోయే రోజ్జుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం జూన్ 22 నుండి ఆగస్టు 3వ తేది వరకు అన్ని వార్డుల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తామని,పట్ణణ ప్రజలు ఎక్కడైతే మురికి నీరు ఇబ్బందులు ఉన్నట్లైతే పురపాలక సంఘ కార్యాలయానికి సంప్రదించాలని కమీషనర్ గోపు గంగాధర్ సూచించారు.అనంతరం13వ వార్డులో సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండడంతో వార్డులో పర్యావేక్షణ చేసి నిలబడి ఉన్న వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్ళే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ రేష్మాబేగం ఎజాజ్, కార్యాలయ సిబ్బంది, పారిశుద్య కార్మికులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
