Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 1:44 pm Posted by : ramakrishna

బిహార్‌ ఓటమిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతాం

డిల్లీ, బతుకమ్మ :  బిహార్‌ ఓటమిపై కాంగ్రెస్‌ పోస్టుమార్టం చేపట్టింది. డిల్లీలోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఇందుకు సంబంధించిన సమావేశం ముగిసింది. ఈసమావేశానికి  రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌ హాజరయ్యారు.  ఈసందర్భంగా కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ  .. బిహార్‌ ఫలితాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. బిహార్‌ ఫలితాలపై మాతో పాటు ప్రజలకూ అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యనించారు.  ఎన్నికల కమిషన్‌ తీరుపై సందేహాలు ఉన్నాయన్నారు. బిహార్‌ ఓటమిపై పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతామన్నారు.