Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:24 pm Posted by : ramakrishna

సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేస్తాం

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద, బతుకమ్మ :

బిచ్కుందలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ రోడ్డు పనులను సకాలంలో పూర్తి చేస్తామని దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని  ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు స్పష్టం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నది గనుకనే పనులపై శ్రద్ధ వహిస్తూ అధికారులను సమన్వయపరిస్తున్నామన్నారు. పాలనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని గత ఎమ్మెల్యే 15 సంవత్సరాల కాలంలో ప్రజలను మభ్య పెట్టడమే కాకుండా కేవలం ఎలక్షన్లో ఓట్ల కోసం రోడ్డు పనులను ప్రారంభించి తల తోక లేకుండా వదిలేయడం వల్లనే ఏడు మాసాల ఆలస్యం జరిగిందని అట్టి పొరపాట్లను సరిదిద్దుతూ రోడ్డు పనులకు ఒక రూపం తెచ్చే ప్రక్రియలో భాగంగానే ఆలస్యమైందే తప్పితే మరొక ఉద్దేశం లేదని ఆయన పత్రిక ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.