Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 1:05 pm Posted by : ramakrishna

 నిజామాబాద్ అనే పేరు మార్చి తీరుతాం

 

. . . బల్ధియాలొ తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపడం ఖాయం

. . . నిజాం అనే పేరు అంటేనే ధరిధ్రం

. . . నిజామాబాద్ బల్ధియాపై బిజేపి జండా  ఎగురవేస్తాం

. . . నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్

 నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ అనే పేరును మార్చి తీరుతాం అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం పార్టి జిల్లా కార్యాలయంలో ఎంపి ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ… హింధూస్తాన్ అనే పేరు ఉండే భవిష్యత్తులో ఉంటాది.. నిజాం కు ముందు ఇందూర్ పేరు ఉండే త్వరలోనే అపేరును పెట్టుతీరుతాం అన్నారు.  గత బల్ధియా అప్పుడే ప్రయత్నం జరిగిన జస్ట్ లో మీస్ అయిందన్నారు. ఈ సారి బల్ధియాపై బిజేపి జండాను ఎగురవేయడంఖాయమని తోలి బల్ధియా సమావేశంలోనే నిజామాబాద్ పేరును ఇందూర్ గా మార్చివేసేందుకు తీర్మాణం జరిపి ప్రభుత్వానికి పంపడం ఖాయం అన్నారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికలలో గతం కంటే 15 శాతం అధిక శాతం సీట్లు గెలుస్తామని దిమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ పేరు అంటేనే ధరిధ్రం అని అన్నారు. నిజామాబాద్ పేరు వలననే జిల్లా అభివ్రుద్ధి కుంటు పడిందని అన్నారు. నిజాం అనే పేరు వలననే నిజాం సాగర్ కు నిళ్లు లేక వెల వెల పోతుంది. నిజాం షుగర్ మూతపడింది. నిజామాబాద్ నగరం డేవలప్ కాలేదు అని అన్నారు. బల్ధియా ఎన్నికలలో బిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఏంలకు ఓటు వేసే ముందు ప్రజలు అలోచన చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన డేవలప్ మెంట్ ను చూసి ఓటు వేయాలని అన్నారు. డియస్ హయంలో ఓకే ఓక్క పై ఓవర్ కట్టారని నేను ఎంపిగా గెలిచిన తరువాతనే జిల్లాలో ప్లై ఓవర్ లు కడుతున్నామని తెలిపారు. బోదన్ లోప్లై ఓవర్ శంకుస్థాపన చేసి ఎండ్లు గడుస్తున్న పనులు జరుగుతా లేవు అని అక్కడ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి నిద్రలో ఉన్నారని అన్నారు.

We will change the name Nizamabad

 కాంగ్రెస్ పార్టిని అ రాముడే కాపాడాలి…..

దేశంలో ఉపాధి హమీ చట్టంలో సమూల మార్పులు చేసి జీ రాంజీ అని పేరు పెడితే ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఎమిటని ప్రధానంగా కాంగ్రెస్ పార్టి దేవుని పేరును రాజకీయంగా వాడుకుంటుందని అపార్టిని రాముడే కాపాడలని ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. జీ రాంజీ చట్టంను నరేగా, ఉపాది హమీ చట్టలలో ఉన్న లోపాలను సరిదిద్ధుతు ఉపాధి కల్పనకు శ్రీకారం చుట్టారని దానిని సీయం రేవంత్ రెడ్డి స్వాగతించాల్సింది పోయి కేంద్రంతో యుద్ధం చేస్తాననడం హస్యస్పధం అన్నారు. జీ రాం జీ ద్వార 120 రోజులు సాధరణ ప్రజలకు, 150 రోజుల పని అదివాసీలకు, గిరిజనులకు కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీకి అవసరమైన అన్ని పనులను తీర్మాణం ద్వార చేసుకుని పని కల్పించడం ముఖ్య ఉద్ధేశం  అన్నారు. ఉపాధి హమీ పనులు కల్పించని యేడల జాబు కార్డు ఉన్నవారికి భ్రుతి కల్పించడం ప్రభుత్వం గ్యారంటి అన్నారు. కేంద్రం 60 శాతం నిధులు, రాష్ట్రం 40 శాతం నిధుల ద్వార ఈ పనులు జరుగుతాయని పారదర్శకంగా చెల్లింపుల కోసం పనులకు జీయో ట్యాగింగ్ తో పాటు ఆదార్ కార్డు అనుసంధానం చేస్తు పని చేసిన వారి ఖాతాలోనే ప్రతి వారం నేరుగా డబ్బులు జమ అవుతాయని అన్నారు. జీరాంజీ పధకం ద్వార పేధలకు ఉపాధితో పాటు పైసలు వారి ఖాతాలో పడటం కాంగ్రెస్ పార్టికి ఇస్టం లేదని ఎంపి అరవింద్ అన్నారు.

We will change the name Nizamabad

కవిత పెట్టె పార్టికి సీయం రేవంత్ రెడ్డి ఫండింగ్….

కల్వకుంట్ల కవిత  తెలంగాణ లో రాజకీయ పార్టి పెట్టడం వెనుక సీయం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఫండింగ్ అయనే చేస్తున్నాడని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. కవిత అయితే పార్టి పెట్టడానికి పైసలు పెడుతారని అనుకుంటలేనని అన్నారు. రేవంత్ రెడ్డి కేంద్రంతో యుద్ధం చేస్తానంటే అయన నాశనం కోని తెచ్చకున్నట్టే అన్నారు. కేసిఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ నిధులు బోంచేసి పైసలు లేవని మొత్తుకుంటే ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తలేదు అనే సాకులు చెప్పేముందుకు ఖర్చులకు సంబంధించిన లెక్కలు చెప్పకుండా పైసలు ఇస్తాలేదని అబాండాలు వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అడిగాడని గవర్నర్, సిబిఐ లు విచారణ అనుమతులు ఇచ్చిన అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన కేసిఆర్, కేటిఆర్ లపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంపి అరవింద్ ప్రశ్నించారు.

ఈ విలేఖరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారీ, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, నాయకులు పోతన్ కర్ లక్ష్మినారాయణ, నాగోళ్ల లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గోన్నారు.