- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య
మోపాల్, బతుకమ్మ : అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయిన మంచిప్ప 21 ప్యాకేజీ ద్వారా నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలోని గడ్కోలు సెగ్మెంట్లోనీ 84 వేల ఎకరాల కు నీళ్లు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ తో రైతులతో ఆందోళన చేపట్టనున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య వెల్లడించారు. రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఆందోళనలు చేపట్టనున్నామని వారు తెలిపారు. బుధవారం మోపాల గ్రామంలో రైతులతో వారి పొలాల వద్దనే కరపత్రాలు పంచుతూ మాట్లాడారు. 2018న ప్రారంభించిన ఈ పథకం పనులు సగం వరకే పూర్తయ్యాయని మిగతా పనులు పూర్తికావడానికి గాను రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసి ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకంలో రూరల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలోని 84 గ్రామాలు వాటి అనుబంధ తండాలకు నీళ్లు అందుతాయని దీనితో పాటు ఈ ప్రాంత చెరువులు కుంటలు నింపవచ్చని అన్నారు. ప్రజాపాలనలో రైతు రాజ్యం రైతు నేస్తం అంటున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్యాకేజీ పనులు ప్రారంభించడంలో ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతం ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీ శాసనసభ్యులు చోరవ చూపి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి ఏ చిన్నయ్య, రైతు నాయకులు మాజీ సర్పంచ్ దండు నరసయ్య, కే.గోవర్ధన్, కే.భూమన్న, మంగల్ పాడు చిన్న గణేష్, కైలాస్, తిరుపతి, కైలాస్ పోశెట్టి, దొరుండి రమేష్, తదితరులు పాల్గొన్నారు.