…ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
భూమికోసం భుక్తి కోసం ఈ దేశం విముక్తి కోసం విప్లవద్యమంలో అమరులైన అమరవీరుల పోరాటస్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తేదీ ఆదివారం మెంట్రాజ్ పల్లి గ్రామంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జెపి గంగాధర్ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక సభను నిర్వహించారు. ఈ సభకు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. దేశ సంపదలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న రైతులను కార్మికులను భూముల నుండి పరిశ్రమల నుండి భేదాకలు చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ల సేవలో ప్రధాన మోడీ తరిస్తున్నారన్నారు. రైతుల పంటలకు కేంద్రంలో మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతుల రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయాలని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు బ్యాంకు ద్వారా తీసుకున్న 13లక్ష కోట్ల అప్పులను మాఫీ చేయించి వారీ మెప్పు పొందారని అన్నారు. మరొక దిక్కు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4కోడ్లు గా కుదించి కార్మికుల ఉపాధిని కొల్లగొట్టి వారి పనిగంటలను పెంచి శ్రమ దోపిడికి గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలను ఖండించాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని అన్నారు. ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తులం బంగారం వెంటనే అమలు పరచడం లేదని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానన్న హామీ అమలు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేనట్లయితే అమరవీరుల పోరాటస్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. ఈ సభలో మండల కార్యదర్శి జెపి గంగాధర్. పి ఓ డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మొద్దు సుప్రియ. నాయకులు ఎడ్ల రాణి. గంగాధర్. పెద్దమ్మక్క.మేకల రాజమణి.ఎడ్ల శాంత.ఇందిర. గుర్రపుగోదావరి. ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.
