Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 8:04 pm Posted by : ramakrishna

దేశంలో సమ సమాజాన్ని నిర్మిస్తాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం,అహింస మార్గంలో దేశంలో సమ సమాజాన్ని నిర్మిస్తామని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు బాల్కొండ నియోజకవర్గం లోని బస్సాపూర్, నాగపూర్ గ్రామాలలో నిర్వహించారు. ముందుగా  బస్సాపూర్ లో పాదయాత్ర నిర్వహించి గ్రామంలోని మహాత్మా గాంధీ, కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని పార్లమెంట్ సాక్షిగా అవమానించారని అన్నారు.మహాత్మా గాంధీ ఆలోచన విధానాలైన సత్యం అహింస సిద్ధాంతాలను తుంగల్లోకి తొక్కి తప్పుడు హామీలతో గద్దెనెక్కారని, దేశంలో కులాలు

We will build an equal society in the country.

మతాల మధ్య చిచ్చుపెట్టి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ ని చంపిన హంతకుడు గాడ్సేను పూజించడంలోనే బిజెపి నాయకులు ఎంతటి హింసవాదులో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు బస్సాపూర్ నాగపూర్  గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీను, అరవింద్, తో పాటు యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ  నాయకులు  మహేష్, కృష్ణ, రాజు, నవీన్, సాగర్, సాయందర్, రంజిత్, బస్సాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాపు మహేశ్వర్ నాగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేష్ బాల్కొండ మండల  కార్యక్రమ సమన్వయకర్త ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు  వేణు రాజ్ పాల్గొన్నారు.

We will build an equal society in the country.