Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 7:52 pm Posted by : ramakrishna

రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తాం

  • శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు 

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుండి కోరుట్లపేట కు వెళ్లే రహదారి లో గల జంగమొని పట్టే కాలువ వద్ద ఇటీవల కురిసిన వరుస వర్షాల కారణంగా కల్వర్ట్ వద్ద గల రోడ్డు దెబ్బతిన్నది.ఇట్టి విషయం స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహేందర్ రెడ్ది పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడి ఇట్టి సమస్య కు పరిష్కారం చూపాలని చెప్పగా పంచాయతీ రాజ్ డి ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి ప్రస్తుతం రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తామని అధికారులు అన్నారు.శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం కోసం అంచనాలు తయారు చేయాలని కేకే మహేందర్ రెడ్ది చెప్పారని బ్రిడ్జి నిర్మాణం కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. డి ఈ వెంట పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఏ ఈ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.