ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం
. . . జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఎన్. వర్షిణి, సాయి బాబాలకు సోమవారం నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా...