తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని తెలిపారు. 12 ఏళ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు...