Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 6:42 pm Posted by : ramakrishna

2003 డీఎస్సీకి పాత పెన్షన్ వర్తింపజేయాలని కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

  • పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేడు 2003 డిఎస్సి కి పాత పెన్షన్ వర్తింపజేయాలని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్ష వ్యక్తం చేస్తున్నామని పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వం అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని పి ఆర్ టి యు తెలంగాణ అనేక పోరాటాలు చేస్తూ వివిధ వినూత్న కార్యక్రమాల్లో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, మానవహారము, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు, ధర్నాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నేడు హైకోర్టు డీఎస్సీ 2003 అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని తీర్పు వెలువడినందుకు  పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా పక్షాన అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి హర్షం వ్యక్తం చేశారు.