మా ఇసుక మాకే కావాలి

కోడిచర్ల గ్రామస్తుల డిమాండ్   బతుకమ్మ, కోటగిరి :  మా ఇసుక మాకే కావాలంటూ  పోతాంగల్ మండలం కోడిచర్ల గ్రామస్తులు డిమాండ్ చేశారు.  పోతంగల్ గ్రామానికి చెందిన ఇసుక వే బిల్లుల పై  కోడిచర్ల గ్రామ శివారు సర్వే నెంబర్ 334 నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని కోడిచర్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమంగా తమ గ్రామ శివారు నుండి ఇసుక తరలింపున అడ్డుకోవాలని తహసీల్దార్ గంగాధర్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమం లో కోడిచర్ల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.