శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దండు శేఖర్ ను బుధవారం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆందోళన చెంద వద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు...