అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్ నిజామాబాద్, బతుకమ్మ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం చేసిన మహానీయుడని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జమాత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అసభ్యమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనాన్ని పెంచుతాయని...