గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి
. . . మహిళా సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్ధ్యాలను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు....