Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 8:19 pm Posted by : ramakrishna

క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలి

 

. . . అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

క్షయ రహిత సమాజమే మన అందరి లక్ష్యమని, క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో క్షయ రహిత గ్రామపంచాయతీల కు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. క్షయ రహిత గ్రామ పంచాయతీలుగా నిలిచిన 18 గ్రామ పంచాయతీలకు జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

 

We should work towards a tuberculosis-free society.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 18 గ్రామపంచాయతీలే కాకుండా జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో పట్టణాల్లో క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ టిబి ముక్తభారత్ అభియాన్ 1.0 గత సంవత్సరం 28వ తేదీ మే నెలలో ప్రారంభించడం జరిగిందని, దీనిలో భాగంగా జిల్లాలో 342,889 మంది జనాభాను టార్గెట్ గా నిర్ణయించగా, 88000 మందికి మొబైల్ ఎక్స్రే ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 13000 మందికి సిబి నాట్ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగింది. వీరిలో 489 మందికి క్షయ పాజిటివ్ గా నిర్ధారణ కాగా, పాత క్షయ వ్యాధిగ్రస్తులు 1255 ఉన్నారని, ఈ సంవత్సరం మార్చి 24 వ తేదీన టీవీ ముక్తభారత అభియాన్ 2.0 ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో 112 గ్రామాలలో మూడు డిజిటల్ ఎక్స్ప్రె మిషన్ లు, 8 టీబీ నాట్ మిషన్ల ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో ఇంకా హెచ్ఐవి, హెచ్బీఎస్ ఏజీ, వైడల్, హెచ్బి ,బిపి ,ఆర్ బి ఎస్ మొదలగు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 2026 సంవత్సరం కి 18 జీపీ లూ ఈ అవార్డు లను పొందాయని, వీటిలో పోతునూరు, తాళ్ల రామడుగు సిల్వర్ అవార్డు పొందాయని, మిగితా జీపీ లు కాంస్య అవార్డు పొందాయన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చేతుల మీదుగా టీవీ ముక్తభారత అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు.

 

We should work towards a tuberculosis-free society.

 

క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాలో అంకితభావంతో పనిచేసిన సిబ్బంది రేడియో గ్రాఫర్ కాలేద్, ఎస్ టి ఎస్ లు స్రవంతి, పద్మ, టీబీహెచ్బీలు ఏ ఔన్ అహ్మద్, విజయ మాల, ల్యాబ్ టెక్నీషియన్ స్వరాజ్యలకు మేమొంటోలు అందించారు. ఈ కార్యక్రమం లో జడ్పీసీఈవో సాయా గౌడ్, డీఆర్డిఏ పిడి సాయన్న, డిఎంహెచ్ఓ డా.రాజశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.దేవి నాగేశ్వరి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ సెక్రటరీలు, వైద్య సిబంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

We should work towards a tuberculosis-free society.