రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : అన్నదాతకు ఆలంబనగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి సూచించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ నూతనంగా ఆడియో, విజువల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం నుండి వర్చువల్...