భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం మెండోరా మండలం చాకిర్యాల్, కొడిచెర్ల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మెండోరా మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా...