- నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే ఆరు నెలల కాలానికి నేరాల నియంత్రణకు ప్రణాళికల ప్రకారం పని చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపు నిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతు.. నేరాల నియంత్రణకు ప్రతి పిఎస్ పరిధిలో బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించి, సిబ్బందికి సంబంధించి వెల్ఫేర్ కోసం యాక్షన్ ప్లాన్ నిర్వహించాలని కోరారు. చోరీల విషయంలో ట్రెండ్ ను అర్థం చేసుకొని పెట్రోలింగ్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్ పై శ్రద్ధ చూపాలని కోరారు. పెండింగ్ కేసుల పరిశోధన పూర్తి చేయాలని, కోర్టు కేసుల పరిష్కారం దిశగా పనిచేస్తు, మహిళల భధ్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తు గేమింగ్ యాప్ లతో పాటు మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి లాంటి చట్ట వ్యతిరేక కార్యాకలపాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి తో పాటు ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు.