- తెలంగాణ కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
బతుకమ్మ,బాల్కొండ: విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి గ్రామీణ స్థాయి నుంచి ఒలంపిక్స్ ఒలంపిక్స్ స్థాయికి స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చాలని తెలంగాణ కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో విద్యా వైద్య రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని అంతే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా విద్యారంగానికి ఎంతో సేన ఎనలేని సేవలు అందించడం జరిగింది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల ఉన్నటువంటి నిబద్ధతే తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలపడానికి ఇటీవల మెగాడీఎస్ ని నిర్వహించడం జరిగిందన్నారు, డీఎస్సీని నిర్వహించడమే కాకుండా సకాలంలో వారికి ఉత్తర్వులు ఇచ్చి ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ఇచ్చి విదులలో చేరే విధంగా చేశారన్నారు. చరిత్రలో ఎన్నటి లేని విధంగా అన్ని గురుకులాల విద్యార్థుల యొక్క డైట్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందన్నారు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు నిర్వహించారు , పాఠశాల స్థాయిలో పా పారిశుద్ధ్య నిర్వహణ కొరకు స్కావెంజర్లు నియమించారన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందన్నారు, దీనికి ప్రతిఫలంగా విద్యార్థిని విద్యార్థులు విద్యారంగంలో తెలంగాణని అగ్రగామిగా నిలవాలని అంతే కాకుండా విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలంపిక్ స్థాయికి ఎదగాలని ఆయనఆకాంక్షించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సందర్భంగా బాల్కొండ ఉన్నత పాఠశాల క్రీడా క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దుటకు తన వంతు సహకారాన్ని అందించుటకు ముఖ్యమంత్రి వద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎంపీడీవో. విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, క్రీడల ఆర్గనైజర్ రాజ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ , మాజీ సర్పంచ్ తౌట్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.