ఏపీజే కలాం ను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు సిద్ధపడాలి

టాప్ మెరిట్ విద్యార్థులకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ తరపున అవార్డుల ప్రదానం.   ఆర్మూర్, బతుకమ్మ: ‘‘ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆయనలా దేశానికి తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉండాలి,’’ అని చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవర్తి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్‌ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభా విద్యార్థులకు టాపర్‌మెరిట్ అవార్డులు అందజేయడంతో పాటు ఉచిత పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజశేఖర్...