. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని, ఆన్లైన్ బెట్టింగ్ కు వారిని దూరంగా ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలు లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రమాదాలు కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని, రోడ్డు భద్రతా నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం, క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ, ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ కి సంబందించిన ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి, ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సిఐ సత్యనారాయణ, ఆర్మూర్ రూరల్ సీ.ఐ జి. జాన్ రెడ్డి, ఐ-రాడ్ మేనేజర్ వర్ష, ఆర్మూర్ డివిజన్ ఎస్.ఐ లు రజనీకాంత్, సంజీవ్, అనిల్, రాము, శ్యామ్ రాజ్, శైలేందర్, కిరణ్ పాల్, రాజేశ్వర్, ఎన్ఎస్సీ కౌన్సిల్ మెంబర్స్ సుందర్, క్రాంతి గంగారెడ్డి, నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి, సాగర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లు, వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
