Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 4:30 pm Posted by : ramakrishna

భారత రాజ్యాంగ రక్షణకు అంబేద్కర్ స్ఫూర్తితో పోరాడాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఆర్ఎస్ పీ నాయకులు అన్నారు. మంగళవారం ఆర్ ఎస్ పీ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తా వద్ద డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం విలువలతో భారత రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి అంబేద్కర్ అని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు అంబేద్కర్ స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పీ, ఏఐపీఎస్ యు, ఆర్ వైఎఫ్ నాయకులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.