Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 5:41 pm Posted by : ramakrishna

బాధ్యతతో పని చేసే వారిని ఎన్నుకోవాలి

. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ:

 

రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 19, 5 వ వార్డులో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 19 వ వార్డు, 5 వ వార్డు ప్రజలతో గత 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియచేశారు. రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు. గతంలో బాన్సువాడ పట్టణం గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత సుమారు 200 కోట్ల రూపాయలతో బాన్సువాడ పట్టణం అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.