Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 5:56 pm Posted by : ramakrishna

రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను చాటి నిజామాబాద్ ప్రతిష్టను పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని దోమలగూడలో మంగళవారం నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా,నిజామాబాద్ జిల్లా నుండి 35 మంది బాలబాలికలతో కూడిన బృందం ఈ పోటీల్లో పాల్గొనేందుకు సోమవారం బయలుదేరి వెళ్ళింది.

 

We should bring a good name to the district by showcasing our talent in state-level competitions.

ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నుండి చిన్నారులు బయలుదేరి వెళ్తున్న ప్రత్యేక బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి, చిన్నారులకు ఆల్ ది బెస్ట్ అని విషెస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. చిన్నారులను జాగ్రత్తగా తీసుకెళ్లాలని, క్రీడలు ముగిసిన అనతరం తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ అశోక్, భవిత కేంద్రాల కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.

 

 

We should bring a good name to the district by showcasing our talent in state-level competitions.