గ్రామ పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలి

  . . . మండల పంచాయతీ అధికారి రాము   జుక్కల్, బతుకమ్మ :   గ్రామ పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని మండల పంచాయతీ అధికారి రాము పిలుపునిచ్చారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో గురువారం స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు మండల పంచాయతీ అధికారి రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ ప్రజలందరూ సహకరించి బస్వాపూర్‌ను పరిశుభ్రమైన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని సూచించారు....