తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్లను స్మరించుకుంటున్నాం
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్లను స్మరించుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసన సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదతర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందన్నారు. దాన్ని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన...