కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం
హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లిలా మార్చారని, ఆ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన పనిని చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని కోట్లాది మంది బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పూవులను బతుకమ్మగా పేర్చి పూజించే...