Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 5:01 pm Posted by : ramakrishna

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం

మోర్తాడ్, బతుకమ్మ: కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కళాశాలకు వచ్చిన పేరెంట్స్ ను ఉద్దేశించి  యోగా, ధ్యానం లాంటి అనేక కార్యక్రమాలను మా కళాశాలలో నేర్పిస్తున్నామని వివరించారు. కళాశాల మొత్తం సి సి కెమెరా పర్యవేక్షణ లో ఉందని మీ పిల్లలను మా పిల్లలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

We provide quality education to students