Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 4:48 pm Posted by : ramakrishna

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం

మోర్తాడ్, బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో  అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో  నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని   మోర్తాడ్ మండల విద్యాధికారి సామ్మిరెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండలంలోని దర్మోరా గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. విద్యార్థులకు ఇంటి బోజనంలా వండలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠ్య పుస్తకాలలో పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డొంకల్ కాంప్లెక్స్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

We provide quality education to students