స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు బతుకమ్మ, ఎల్లారెడ్డి : అమృత్ స్కీం ద్వారా మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 స్కీం ద్వారా నీటి సరఫరా పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎల్లారెడ్డి మున్సిపాలిటీకే అత్యధికంగా నిధులు కేటాయించామని అన్నారు. మినీ ట్యాంక్ బండ్, పార్క్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, సిసి...