Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2025, 11:27 am Posted by : ramakrishna

సైనికుల ఆరోగ్యం కోసం దేవుణ్ణి ప్రార్థించాం

పాక్ అంతర్గతంగా విభజించబడింది

ఎంపీ అర్వింద్

నిజామాబాద్, బతుకమ్మ : సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికుల ఆరోగ్యం, విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించామని ఎంపీ అర్వింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు “మనం సైతం దేశం కోసం”  కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్  హనుమాన్ మందిరంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తో కలిసి  ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన ప్రతి ఒక్కరు చూశారన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినదిగా పరిగణిస్తున్నామన్నారు. పాక్ దేశం అంతర్గతంగా విభజించబడి ఉందన్నారు. కొంతమంది టెర్రరిస్ట్ లకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

We prayed to God for the health of the soldiers.