. . . బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల్ రామారావు
. . . బాన్సువాడ బాధితులను జైల్లో కలిసి పరామర్శించిన హైకోర్టు న్యాయవాదులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బాన్సువాడ, కామారెడ్డి ల్లో అమాయక హిందువులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల్ రామారావు పేర్కొన్నారు. ఇటీవల బాన్సువాడ లో జరిగిన అల్లర్లలో అరెస్టై నిజామాబాద్ సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వివిధ సంస్థల బిజెపి కార్యకర్తలను శనివారం ఆయన నాయకత్వంలోని హైకోర్టు న్యాయవాదులు, ప్రతినిధుల బృందం జైలు ములాఖాత్ లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెయిలు పొందేందుకు చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. రాష్ట్రాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఒక వర్గానికే వత్తాసు పలుకుతుందని అన్నారు. అల్లర్లకు సంబంధం లేని అమాయక హిందువులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, బాన్సువాడలో జరిగిన సంఘటనకు బాధ్యులైన సంఘ వ్యతిరేక శక్తులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, కార్యదర్శి బిట్ల రవి, చింతకుంట సాయి రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ అంతోని రెడ్డి, హై కోర్టు న్యాయవాదులు ఎమ్ వి రామారావు, బాన్సువాడ సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.