ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా సన్నద్ధం కావాలి
విద్యార్థులకు ప్రేరణ కల్పించిన కలెక్టర్ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు నిజామాబాద్, బతుకమ్మ : ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థిని, విద్యార్థులకు ఉద్బోధించారు. అంకిత భావంతో కఠోర సాధన చేస్తే ఒలింపిక్స్ లక్ష్యం సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు...