స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా, ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు...